దారుణం.. చైన్ కోసం మహిళను ఎలా ఈడ్చుకెళ్లారో చూడండి.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో..

వారిని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు.. వెనుక నుంచి మంజులను టార్గెట్ చేశారు.

Chain Snatch Video (Photo Credit : Google)

Chain Snatch Video : తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు బరి తెగించారు. దారుణానికి ఒడిగట్టారు. చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో ఓ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు చైన్ స్నాచర్లు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు.

ఈ నెల 20వ తేదీన ఈ ఘోరం జరిగింది. మంజుల, ద్వారకానాథ్ దంపతులు పంతడీలో నివాసం ఉంటారు. దీపావళి పండుగ షాపింగ్ కోసం భార్య, భర్త బైక్ పై బయటకు వెళ్లారు. రోడ్ సైడ్ లో భర్త తన బైక్ ని ఆపాడు. అతడి వెనుక భార్య మంజుల ఉంది. బైక్ ని ఆపడంతో భార్య కిందకు దిగే ప్రయత్నంలో ఉంది. ఇంతలో ఊహించని షాకింగ్ ఘటన జరిగింది.

వారిని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు.. వెనుక నుంచి మంజులను టార్గెట్ చేశారు. ఒకడు బైక్ నడుపుతుండగా.. వాడి వెనుకే కూర్చున్న మరొకడు.. మంజుల మెడలోని చైన్ లాగడానికి ప్రయత్నించాడు. అయితే చైన్ వాడి చేతికి రాలేదు. ఈ క్రమంలో మంజుల కిందపడిపోయింది. అయినా ఆమెను వదల్లేదు. ఆమెను అలాగే కొంత దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో గొలుసు తెగిపోయింది. రెండు భాగాలైంది. ఒక భాగం బాధితురాలి వద్దే ఉండిపోయింది.

ఊహించని ఈ ఘటనతో మంజుల, ఆమె భర్త షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో కూడా భర్తకి అర్థం కాలేదు. భార్యను కాపాడే ప్రయత్నంలో అతడు కూడా బైక్ తో సహా రోడ్డుపై పడిపోయాడు. అతడు లేచే సరికి చైన్ స్నాచర్లు అక్కడి నుంచి పరారయ్యారు. చైన్ స్నాచింగ్ కి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్న ఈ వీడియో చూసి అంతా భయాందోళనకు గురవుతున్నారు.

మెడలో గోల్డ్ చైన్లు వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఎప్పుడు ఎటువైపు నుంచి ఆపద వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు. వీధుల్లోకి వచ్చిన సమయంలో మెడను ఏదైనా వస్త్రంతో కవర్ చేసుకోవడం మంచిదని పోలీసులు అంటున్నారు.

 

Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో సంచలనం.. పరారీలో ఫారెస్ట్ ఆఫీసర్..? గాలిస్తున్న పోలీసులు..!