Medak Car Fire Mishap Case : మెదక్ జిల్లాలో సజీవదహనం కేసులో షాకింగ్ ట్విస్ట్.. డబ్బు కోసం సెక్రటేరియట్ ఉద్యోగి దారుణం

మెదక్ జిల్లాలో సజీవదహనం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నత ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. కానీ, అతడి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఓ పెట్రోల్ బాటిల్ నిందితుడిని పట్టించింది. పక్కా స్కెచ్ వేసినా.. నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు.

Medak Car Fire Mishap Case : డబ్బు కోసం మనిషి దిగజారిపోతున్నాడు. దారుణాలకు ఒడిగడుతున్నాడు. కనీవినీ ఎరుగని నేరాలకు పాల్పడుతున్నాడు. మెదక్ జిల్లాలో సజీవదహనం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నత ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. కానీ, అతడి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఓ పెట్రోల్ బాటిల్ నిందితుడిని పట్టించింది. పక్కా స్కెచ్ వేసినా.. నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు.

డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడో వ్యక్తి. డబ్బు కోసం ఏదైనా చేయాలనుకున్న అతడు రకరకాల మార్గాలు అన్వేషించాడు. చివరకు పెద్ద డ్రామా వేశాడు. తనను తాను చనిపోయినట్లు చిత్రీకరించుకున్నాడు. ఇందుకోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఎంత పక్కాగా ప్లాన్ వేసినప్పటికి.. చివరికి పోలీసులకు చిక్కాడు.

Also Read..Delhi Man Hacked : అత్యంత కిరాతకం.. యువకుడిని చంపి ముక్కలుగా నరికి ఆ వీడియోను పాకిస్తాన్‌ పంపారు, ఎందుకో తెలిస్తే షాక్

పెట్రోల్ బాటిల్ నిందితుడిని పట్టించింది. ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిలే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ డ్రామా నడిపింది ఓ కరుడుకట్టిన క్రిమినల్ అంటే పొరపాటే. సచివాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడి పేరు ధర్మా నాయక్. అతడు చేసిన మర్డర్ డ్రామా బయటపడటంతో ధర్మా నాయక్ కాస్తా డ్రామా నాయక్ గా మారాడు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో సజీవదహనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా మర్డర్ కథను నడిపాడు ధర్మా నాయక్. సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న ధర్మా నాయక్.. వ్యసనాలకు బానిసగా మారాడు. విపరీతంగా అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి అతడు ఖతర్నాక్ స్కెచ్ వేశాడు.

Also Read..Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన భార్య

ధర్మా నాయక్ కు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. తాను చనిపోతే ఆ డబ్బులు వస్తాయని, వాటిలో అప్పులు తీర్చవచ్చని భావించాడు. అంతే, సినిమాలోని క్రైమ్ సీన్ ను తలపించేలా డ్రామా ఆడాడు. తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశాడు. డ్రైవింగ్ సరిగా రాకపోయినా నెల రోజుల క్రితం ధర్మా నాయక్ సెకండ్ హ్యాండ్ లో ఓ కారుని తీసుకున్నాడు. అనంతరం తన అల్లుడితో కలిసి స్కెచ్ వేశాడు.

ఈ నెల 8న బీహార్ కు చెందిన ఓ డ్రైవర్ కు హైదరాబాద్ లో రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి అద్దెకు మాట్లాడుకున్నాడు. డ్రైవర్ ని తీసుకుని ధర్మానాయక్ అతడి అల్లుడి బాసర వెళ్లాడు. కారులోనే ధర్మా చనిపోయినట్లు చిత్రీకరించాలని ధర్మా నాయక్ అతడి అల్లుడు ప్లాన్ చేశారు. చివరికి మెదక్ లో డ్రైవర్ ను కారులోనే సజీవదహనం చేశారు. డ్రైవర్ ఆనవాళ్లు లేకుండా కారులోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ముందుగా అందరూ ధర్మా నాయర్ చనిపోయాడని అనుకున్నారు. కానీ, అది ధర్మా నాయక్ కాదని పోలీసులు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ నెల 9న జరిగిన సజీవ దహనం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో వెంకటాపురం వాసులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు పెట్రోల్ బాటిల్ దొరికింది. కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. పెట్రోల్ బాటిల్ నే కీలక ఆధారంగా చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ముమ్మరంగా దర్యాఫ్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. నిందితుడిని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ధర్మా నాయక్ బతికే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ధర్మా నాయక్ ఈ డ్రామా ఆడినట్లు తేల్చారు.

సజీవ దహనం వెనుక అనేక అనుమానాలు..
* ఘటన జరిగినప్పటి నుంచి అన్నీ అనుమానాలే.
* ప్రమాదం అనిపించేలా ఎత్తు నుంచి పడిన కారు.
* హత్య అనిపించేలా దగ్ధం, పక్కనే పెట్రోల్ బాటిల్.
* రెండు అంశాలకూ పొంతన లేకుండా సీన్ ఆఫ్ అఫెన్స్.
* హత్య అని చెప్పినా కుటంబీకుల నుంచి కనిపించని ఆవేశం.
* పోలీసులు వచ్చీ రాగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు.
* మనిషి చనిపోయినా కుటుంబీకుల్లో కనిపించని బాధ.
* అంత్యక్రియల తర్వాత కుటుంబీకుల్లో ఇద్దరు మిస్సింగ్.
* హత్య జరిగినా పోలీసులకు ఫాలో అప్ చేయని కుటుంబీకులు.