Delhi Man Hacked : అత్యంత కిరాతకం.. యువకుడిని చంపి ముక్కలుగా నరికి ఆ వీడియోను పాకిస్తాన్‌ పంపారు, ఎందుకో తెలిస్తే షాక్

యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిని చంపిన ఇద్దరు ఉగ్రవాదులు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కు పంపారు. పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటకు వచ్చింది.

Delhi Man Hacked : అత్యంత కిరాతకం.. యువకుడిని చంపి ముక్కలుగా నరికి ఆ వీడియోను పాకిస్తాన్‌ పంపారు, ఎందుకో తెలిస్తే షాక్

Delhi Man Hacked : యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిని చంపిన ఇద్దరు ఉగ్రవాదులు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కు పంపారు. పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటకు వచ్చింది.

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా షాకింగ్ విషయం తెలిసింది. వారు ఓ వ్యక్తిని హత్య చేసి, తల నరికి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

వాయవ్య ఢిల్లీలోని భల్ స్వా డెయిరీ ప్రాంతంలో మృతదేహం విడి భాగాలను పోలీసులు కనుగొన్నారు. అంతేకాదు, అరెస్ట్ అయిన ఉగ్రవాదుల సెల్ ఫోన్ నుంచి వీడియోను కూడా సేకరించారు.

అరెస్ట్ అయిన ఉగ్రవాదులను జగ్జీత్ సింగ్ జస్సా అలియాస్ యాకూబ్ (29), నౌషాద్ (14)గా గుర్తించారు. వారి నుంచి 3 పిస్టళ్లు, 22 కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు. వారికి కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

ఇద్దరు ఉగ్రవాదులు ఈ నెల 15న యువకుడికి మద్యం ఆశ చూపి తాముంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ అతడిని చంపి ముక్కలుగా నరికి వీడియో తీశారని పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోను పాకిస్తాన్ పంపారని చెప్పారు. ఆ తర్వాత యువకుడి శరీర భాగాలను కాల్వలో పడేశారు. తమకు హత్య చేసే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ లోని లష్కర్ గ్రూప్ ఉగ్రవాదుల వద్ద నిరూపించుకునేందుకు ఆ ఇద్దరు ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

చేతి మీద త్రిశూలం టాటూ ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించారు. అతడి వయసు 21ఏళ్లు అని, అతడు మాదకవ్యాలకు బానిస అని తెలిపారు. మృతుడిని ఆదర్శ్ నగర్ నుంచి తీసుకెళ్లారు. బల్వాసా డైరీ ప్రాంతంలోని తన ఇంటికి నౌషాద్ తీసుకెళ్లాడు. డిసెంబర్ 14న ఈ ఘటన జరిగింది. యువకుడిని ఇంటికి తీసుకెళ్లిన ఉగ్రవాదులు అతడిని చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని 8 ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సొహైల్ కు పంపారు. ఈ మర్డర్ వీడియో చూశాక నౌషాద్ బ్యాంకు ఖాతాలోకి రూ.2లక్షలు వచ్చి పడ్డాయి. ఖతార్ లో నౌషాద్ బావ ఉంటాడు. అతడి ద్వారా నౌషాద్ కు డబ్బు అందింది. అత్యంత కిరాతకమైన ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పాత్రపైనా ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

నౌషాద్ టెర్రరిస్ట్. చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. హత్య, దోపిడీ వంటి అనేక కేసుల్లో అతడు జైలుకి వెళ్లాడు. ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్-అన్సార్‌తో అతడికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

జైల్లో ఉన్న సమయంలో ఆరిఫ్ మహమ్మద్, సొహైల్ తో నౌషాద్ కు పరిచయం ఏర్పడింది. ఆరిఫ్ ఎర్రకోటపై దాడి కేసులో నిందితుడు కాగా, సొహైల్.. లష్కరే తోయిబా ఉగ్రవాది. సొహైల్ 2018లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఏప్రిల్ 2022లో నౌషాద్ జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి సొహైల్ తో నౌషాద్ టచ్ లోనే ఉన్నాడు.

ప్రభావవంతమైన హిందువులను హత మార్చేందుకు నౌషాద్‌కు.. సోహైల్ బాధ్యతలు అప్పగించగా, రెండవ నిందితుడు జగ్జిత్ సింగ్‌ను భారతదేశంలో సిక్కు వేర్పాటువాద గ్రూప్ ఖలిస్తాన్ కార్యకలాపాలను ప్రచారం చేయమని కోరినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాతో జగ్జిత్‌కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

నిందితుల నుంచి మూడు పిస్టల్స్, 22 కాట్రిడ్జ్‌లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 2020లో మత ఘర్షణలు జరిగిన జహంగీర్‌పురిలో నివాసం ఉన్నట్టు తెలిసింది. అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు దాని గురించి ఎటువంటి క్లూ దొరకలేదని నిఘా వర్గాలు తెలిపాయి.

ఇద్దరు నిందితులు అందించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు శనివారం ఉత్తర ఢిల్లీలో ఛిద్రమైన మృతదేహాన్ని కనుగొన్నారు. ఉత్తర ఢిల్లీలోని కాల్వ నుంచి మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నారు.