Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో నేడు కీలక మార్పులు.. కారణాలు ఇవే.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. నేడు గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ వారం ప్రారంభంలో వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం రెండు రోజులుగా మళ్లీ పెరుగుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.380 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై రూ.5డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,118 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,820 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,750 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,950 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
