YS Jagan: డీఎస్సీలో అక్రమాలు జరగడం నిజం.. వాళ్ళు కూడా అంగీకరించారు.. వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ys jagan demands cbi probe and nara lokesh resignation over dsc 2025 paper leakage
- డిఎస్సీ లీకేజీపై సీబీఐ డిమాండ్
- ఒకే అధికారి బాధ్యతలపై ఆరోపణలు
- మంత్రి నారా లోకేష్ రాజీనామా
YS Jagan: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీ జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ వ్యవహారంలో తాము లేవనెత్తిన అంశాలు వాస్తవమేనని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు.
TTD Board: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు.. టీటీడీ కీలక సూచనలు
ఒకే అధికారికి బాధ్యతలే అక్రమాలకు మూలం:
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం వల్లే చెక్స్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కామ్‌కు దారితీసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆపై సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాకుతో అతడి పేరును రెండో మెరిట్ లిస్ట్ నుండి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించడం ప్రభుత్వ అక్రమాలకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు.
శాసనమండలి చర్చ నుంచి ప్రభుత్వం పలాయనం:
శాసనసభలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం, శాసనమండలిలో మాత్రం డీఎస్సీ అక్రమాలపై చర్చించేందుకు భయపడుతోందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తమను గుర్తించడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే సొంతంగా ప్రచారాలు చేసుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.
