Road Accident
Road Accident : తమిళనాడులోని కాంచిపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మనమాయ్ గ్రామంలోని మామల్లాపురం సమీపంలోగల ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.
Ayodhya Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీకొని ఏడుగురు మృతి
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.