Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించి దొంగలను పట్టుకున్నారు.

Gold Theft :  శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించి దొంగలను పట్టుకున్నారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని అంపోలు-ఆడవరం రహదారిలో నాలుగు రోజుల క్రితం బంగారం వ్యాపారస్తులను అటకాయించి వారి వద్ద ఉన్న 1652 గ్రాముల బంగారాన్ని, 141 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకువెళ్లారు.  ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

బంగారం వర్తకులు  చోరీ చేసిన రోడ్డులో  బంగారం రవాణా చేస్తారని ముందే పసిగట్టిన శ్రీకూర్మానికి చెందిన  ఒక జ్యూయలర్ షాపు యజమాని చంద్రహర్ష ఈ ప్లాన్ వేశాడు. చోరీలో అతనికి సహకరించిన కసప రాజేశ్, హరి, లక్ష్మీనారాయణలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.  వారి వద్ద నుంచి దొంగిలించిన మొత్తం సొత్తును, ఆరు సెల్ ఫోన్లను, దొంగతనానికి  ఉపయోగించిన రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నామని  జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. అధిక నగదు, బంగారంతో ప్రయాణిస్తున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.

Also Read : PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు

 

ట్రెండింగ్ వార్తలు