దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో కారు బీభత్సం.. విద్యార్థి మృతి

మేడ్చల్ జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద కారు ఢీకొని టెక్ మహేంద్ర యూనివర్శిటీ విద్యార్థి

Road Accident : మేడ్చల్ జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద కారు ఢీకొని టెక్ మహేంద్ర యూనివర్శిటీ విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మృతి చెందిన యువకుడు వరంగల్ కు చెందిన అన్నమనేని మేఘాంశ్ గా గుర్తించారు. అతను మహేంద్ర యూనివర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Also Read : UPSC Aspirants : తప్పుదారి పట్టించే ‘యూపీఎస్సీ స్టడీ ప్రిపరేషన్’ బ్లాగ్స్‌‌కు దూరంగా ఉండండి : ఐఏఎస్ అధికారి సూచన

ప్రమాద విషయాన్నితెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదంలో గాయపడిన వారిని సాయి మానస్, శ్రీచరణ్ రెడ్డి, ఆర్నవ్ గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు