సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

తిరువణ్నమలైకి చెందిన కారంబూర్ ప్రాంతంలో ఓ యువకుడు సెల్ టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వంద అడుగుల ఎత్తు ఉన్న హై టెన్షన్ టవర్ పైకి ఎక్కాడు. అది గమనించిన స్థానికులు అతణ్ని కాపాడాలని భావించి అతనితో పాటుగా టవర్ పైకి ఎక్కారు. వారితో మాట్లాడుతుండగానే దగ్గరికీ రావొద్దు.. రావొద్దు అని వారిస్తూనే వెనుకవైపుకు దూకేశాడు.
కాపాడేందుకు వచ్చిన స్థానికులు అది చూసి భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.