Tamil Nadu : ఇన్‌స్టా క్వీన్‌గా పాపులర్ అయిన 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య..!

పట్టుమని పదేళ్లకు కూడా లేని ఓ చిన్నారి ఇన్‌స్టా క్వీన్ గా పేరు తెచ్చుకుంది. రకరకాల వీడియోలు,ఫోటోలతో పాపులర్ అయ్యింది. ఇన్‌స్టా క్వీన్‌గా పాపులర్ అయిన 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది.

Tamil Nadu : ఇన్‌స్టా క్వీన్‌గా పాపులర్ అయిన 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య..!

Tamil Nadu 9 Years girl life ended

Updated On : March 30, 2023 / 10:55 AM IST

Tamil Nadu : పట్టుమని పదేళ్లకు కూడా లేని ఓ చిన్నారి ఇన్‌స్టా క్వీన్ గా పేరు తెచ్చుకుంది. రకరకాల వీడియోలు,ఫోటోలతో పాపులర్ అయ్యింది. అలా సోషల్ మీడియాలోనే ఉంటున్న కూతుర్ని చదుకోమని మందలించాడు తండ్రి. దీంతో ఆ తొమ్మిదేళ్ల బాలిక తండ్రి మాటలకు మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లాలో సోమవారం (మార్చి,2023) జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చదువుకోకపోతే అమ్మానాన్నలు మందలించటం సర్వసాధారణం. కానీ పట్టుమని పదేళ్లు కూడా లేని బిడ్డ చదువుకోకుండా ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండటం లేదా ఆడుకుంటు ఉండటం చూసిన కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా తన కూతురు బాగా చదువుకోవాలని అనుకున్నాడు. అందుకే చదువుకోమ్మా అంటూ మందలించాడు. తరువాత కృష్ణమూర్తి బైక్ లో పెట్రోల్ ఫిల్ చేయించుకోవటానికి బయటకు వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ కూతురు చేతికి ఇంటి తాళాలు ఇచ్చి బయటకు వెళ్లాడు. తండ్రి మందలించి బయటకు వెళ్లగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

కూతుర్ని మందలించి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి తిరిగి రాత్రి 8.15 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తట్టాడు. కూతురు ఎంతకీ తలుపులు తీయలేదు. నిద్రపోతోందేమో అని అనుకున్నాడు కృష్ణమూర్తి. కానీ ఎంత కొట్టినా తలుపులు తీయకపోయేసరికి ఆందోళన చెందిన కృష్ణమూర్తి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లగా.. బాలిక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. అచేత స్థితిలో ఉన్న కూతుర్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందింది. ఇన్ స్టాగ్రామంలో నిత్యం యాక్టివ్ గా ఉండే తొమ్మిదేళ్ల చిన్నారిని ఇన్ స్టా క్వీన్ అని పిలుస్తుంటారు. అలా తొమ్మిదేళ్లకే ఇన్ స్టా క్వీన్ గా పేరు తెచ్చుకున్న చిన్నారి తండ్రి చిన్నపాటి మందలింపుకే ఆత్మహత్య చేసుకోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది.