యువతిపై అత్యాచార యత్నం – నిందితుడిని హత్య చేసిన బాధితురాలు

teenage girl in Tamil Nadu killed her cousin this is why the cops let her go : తనపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోని హత్య చేసి, పోలీసులకు లోంగిపోయింది ఒక యువతి. తమిళనాడులో ఈ సాహసోపేత గాధ బయటపడింది. ప్రస్తుతం ఈగాధ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ ఆ యువతిని ప్రశంసిస్తున్నారు. యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తిరువల్లూరు జిల్లాలోని శోలవరం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతిని ఆమె కజిన్(24) గత కొన్నిరోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే ఆమె కోసం మాటువేసిన మృగాడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది.
ఈ క్రమంలో ఆయువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కింద పడింది. వెంటనే దాన్నితీసుకున్న యువతి తన మానాన్ని కాపాడుకోటానికి, ఆ యువకుడిపై దాడి చేసింది. కత్తి తీసుకుని అతని మెడ,ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈదాడిలో అతడు మరణించాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యువతిని పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి ఆమె వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు. ఈఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ …..అక్కడ ఏం జరిగిందో ఆమె కళ్లకు కట్టినట్లు వివరించింది. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నిజాయితీపరురాలు కూడా అన్నారు.
వాంగ్మూలం ఇచ్చేటపుడు ఏమాత్రం భయపడలేదు. నిజానికి తను ఫోన్ చేయగానే మావాళ్లు షాకయ్యారు. మృతుడు ప్రవర్తనతో విసుగెత్తిన ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే అతడిని హెచ్చరించారు. అయినా తన తీరు మార్చుకోలేదు. సెక్షన్ 100 కింద కేసు నమోదు చేశాం. ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య కాబట్టి ఆమెకు కొన్ని మినహాయింపులు లభిస్తాయి అని తిరువల్లూరు పోలీసుసూపరింటెండెంట్ పి. అరవిందన్ వివరించారు.