ప్రమోషన్ ఇవ్వలేదని చేతులు, మెడ కోసుకున్న నర్సు

ప్రమోషన్ ఇవ్వలేదని చేతులు, మెడ కోసుకున్న నర్సు

Updated On : November 15, 2019 / 6:07 AM IST

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఎస్ నిర్మల(45) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన్నేళ్లుగా సర్వీసులో ఉన్నప్పటికీ తోటి ఉద్యోగినులకు ప్రమోషన్ ఇచ్చి తనకు ఇవ్వలేదని నర్సు ఆవేశానికి లోనైంది. గురువారం మధ్యాహ్నం భోజనవేళలో ప్రమోషన్ వచ్చిన వారి జాబితా తెలుసుకుని హాస్పిటల్ సూపరిండెంట్ వద్దకు వెళ్లింది. 

తనకు అసిస్టెంట్ మేనేజర్ లెవల్ హోదాకు అర్హత ఉందని ప్రమోషన్ ఇవ్వలేదని తోటి నర్సుల దగ్గర వాపోయింది. తనకంటే జూనియర్‌కు ప్రమోషన్ ఇవ్వడంతో సూపరిండెంట్ ను ప్రశ్నించాలనుకుంది. ఆ సమయంలో సూపరిండెంట్ భోజనం చేస్తున్నానని చెప్పడంతో చేతులు, గొంతు వద్ద కోసుకుంది. 

వెంటనే ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి గాయాలకు చికిత్స్ చేసి కుట్లు వేశారు. గొంతు మీద కుడి, ఎడమ వైపున కట్ చేసుకుంది. అలాగే మణికట్టు మీద కూడా గాయాలయ్యాయి. గాయాలకు కుట్లు వేశాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిమితంగానే ఉందని డిప్యూటీ మెడికల్ సూపరిండెంట్ డా.కృష్ణారెడ్డి తెలిపారు. 

నిర్మలా భర్త ఎం.మల్యా ఫిర్యాదు తీసుకున్న పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ పీ కరుణాకర్ రెడ్డి.. నిర్మల కోలుకున్న తర్వాత ఆవిడ నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.