High Court notice MLA Rajasingh
High Court Notices MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు. అటు రాజాసింగ్‌పై పోలీసులు ఇప్పటికే పీడీయాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు పంపారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ను రిమాండ్ చేసేందుకు నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో హైదరాబాద్ పోలీసులు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసులు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
101 Cases On MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 101 కేసులు.. రౌడీషీటర్‌గా పేర్కొన్న పోలీసులు
దీంట్లో భాగంగా నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేయాలని పోలీసులు పిటీషన్ లో కోరారు. రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సంబంధించి వివరాలను పోలీసులు పిటీషన్ లో పొందుపరిచారు. క్రిమినల్ రివజన్ పిటీషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈరోజు మధ్యాహ్నం విచారించింది.