sheikh peta former MRO sujata Suspicious death
sheikh peta former MRO sujata Suspicious death : షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పదంగా మృతి చెందారు. గతంలో అవినీతి కేసులో అరెస్ట్ అయిన సుజాత మృతి కారణం గుండెపోటు అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సుజాత మృతదేహం నిమ్స్ ఆస్పత్రిలో ఉంచారు. రెండేళ్ల క్రితం రూ.40కోట్ల భూ వివాదంలో షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సుజాత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి సుజాత మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. అవినీతి ఆరోపణలో అరెస్ట్ అయిన సుజాత ఆతరువాత డ్యూటీలో చేరే అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించారు. ఈ క్రమంలో అప్పటినుంచి మానసిక వేదన అనుభవిస్తున్న సుజాత శుక్రవారం (సెప్టెంబర్ 2,2022) రాత్రి ఆమె నివాసంలోనే అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆమె గుండెపోటుతో మరణించారని చెబుతున్నారు. కానీ సుజాత ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మరణించిందని చెబుతున్నారు.
2020లో బంజారాహిల్స్ లోని అత్యంత విలువైన భూ వివాదం కేసులో సుజాతను ఏసీబీ అరెస్ట్ అయ్యారు.అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో గతంలో సుజాత అవినీతి కేసు సంచలనంగా మారింది. షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సమయంలోఆమె భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి.ఈఆరోపణలతోనే సుజాతను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో సుజాత నివాసంలో జరిగిన సోదాల్లో వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో సుజాత జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో సుజాత భర్త 2021లో ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి కేసులో సుజాత అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని..మనో వేదనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భర్త చనిపోయినప్పటి నుంచి సుజాత కూడా డిప్రెషన్ లో ఉందంటున్నారు. మానసిక సమస్యలతోనే సుజాత కూడా సూసైడ్ చేసుకుని ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2020 జూన్ లో భూ వివాదంకేసులో 15 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఏసీబీకి దొరికిపోయాడు. ఆర్ఐని విచారించగా.. ఈ వ్యవహారంలో కేసు మాఫీ చేసేందుకుబంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రనాయక్ లంచం తీసుకున్నారని తేలింది. అతన్ని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ల్యాండ్ సెటిల్ మెంట్ లో అప్పటి షేక్ పేట్ తహశీల్దార్ సుజాత పాత్ర ఉండటంతో ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా సుజాత నివాసంలో నోట్ల కట్టలు లభించాయి.30 లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు దొరికాయి. సుజాత ఇంట్లో దొరికి నగదు చూసి ఏసీబీ అధికారులు షాకయ్యారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమైంది.