బ్రెయిన్‌స్ట్రోక్‌తో అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి.. భోజనం చేస్తూ కుప్పకూలిపోయాడు

అమెరికాలో తెలంగాణ యువకుడు హఠాన్మరణం చెందాడు. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు ..

Heart Attack : అమెరికాలో తెలంగాణ యువకుడు హఠాన్మరణం చెందాడు. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ అధికారి తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30)రెండేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ యూనివర్శిటీలో ఇటీవల ఎంఎస్ పూర్తిచేశాడు. అమెరికాలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, రుత్విక్ రాజన్ స్నేహితులతో కలిసి భోజనం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Also Read : Kakinada District : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం .. నలుగురు మృతి

రుత్విన్ రాజన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. రుత్విక్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బంగారు భవిష్యత్తును ఊహించుకుని విదేశాలకు వెళ్లిన తన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు రుత్విక్ మృతదేహాన్ని సికింద్రాబాద్ లోని నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అతడి మృతదేహాన్నిచూసి శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

 

 

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు