Kakinada District : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం .. నలుగురు మృతి

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అన్నవరం నుంచి రాజమహేద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు

Kakinada District : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం .. నలుగురు మృతి

Road Accident

Road Accident : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాలమ్మగుడి దగ్గర బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కన లారీని నిలిపి టైర్ మార్చుతున్న క్రమంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు మృతిచెందారు. వీరంతా బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Also Read : WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విషాదం.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ప్రముఖ స్పోర్ట్స్ కెమెరామెన్ తిరువల్లువన్ కన్నుమూత

ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి రాజమహేద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు వేగంగా వచ్చి లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన బస్సును గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

 

.