Singer Harini Rao
Singer Harini Rao : సింగర్ హరిణి రావు తండ్రి ఏకే రావు మృతి కేసులో మిస్టరీ వీడింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ఆధారంగా ఏకే రావు మృతిని ఆత్మహత్యగా తేల్చారు బెంగుళూరు పోలీసులు. రైలు పట్టాలపై పడటంతో తీవ్ర రక్తస్రావంతో పాటు షాక్ కు గురైనట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు ఓ ప్రోవిజనల్ స్టోర్ లో ఏకే రావు కత్తిని కొనుగోలు చేశారని… కత్తి కొనుగోలు చేసిన షాప్ లో సీసీ ఫుటేజ్ ని సేకరించామన్నారు పోలీసులు. ఏకే రావు చేతి మణికట్టు, గొంతుపై స్వల్పంగా గాయాలు ఉన్నాయని.. కానీ, హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.
”ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలకపోవడంతో రైలు పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో ఆయన రైలు పట్టాలపై పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది” అని బెంగళూరు పోలీసులు చెప్పారు.
Twitter Safety Policy : ట్విట్టర్‌లో కొత్త నిబంధనలు..ఇకపై అలా చేస్తే కుదరదు
కాగా, ఏకే రావుది హత్య అని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగా విచారణ చేయగా, హత్య చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని బెంగుళూరు పోలీసులు తెలిపారు.
Pumpkin Seeds : శరీరానికి పోషకాలనిచ్చే గుమ్మడిగింజలు
ఏకే రావు మృతికి వారం రోజుల ముందు నుంచే హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. ఓ మృతదేహం బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృదేహం ఏకే రావుదిగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారం రోజులుగా కనిపించకుండా పోయిన హరిణి కుటుంబ సభ్యులు సడెన్ గా రైల్వే పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు ఏకే రావుది హత్యేనని వారు ఫిర్యాదు చేశారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకే రావును సంస్థలో ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేసుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు.