Nellore Temple Burglers Arrested
Burglary Gang Arrested : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేసి వారి వద్దనుంచి శ్రీదేవి, భూదేవి, అచ్యుత స్వామివారి విగ్రహాలతో పాటు హూండీలలో చోరీ చేసిన రూ. 2,10,000 నగదును పోలీసులు రికవరీ చేశారు.
Also Read : Netaji’s Picture On Currency : కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో..కేంద్రానికి 8 వారాల గడువు!
నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలలోని 10 ఆలయాల్లో ఈ ముఠా దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి వాడిన ఆటో, ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల జరిగిన దేవాలయం చోరీతో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి 14రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.