Temple Hundi : చెప్పులు విప్పి గుడిలో హుండీ చోరీ చేసిన దొంగ

దొంగలకు డబ్బు కావాలి కానీ అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి.

Gnt Temple Hundi Theft

Temple Hundi : దొంగలకు డబ్బు కావాలి కానీ అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి.

గుంటూరు జిల్లాలో   గత అర్ధరాత్రి కూడా ఒక ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో విగ్రహం ముందు ఉంచిన హుండీని దొంగ ఎత్తుకెళ్లాడు. కాకపోతే చెప్పులు వేసుకుని దేవుడి ముందుకు వచ్చేందుకు భయం వేసిందో ఏమో చెప్పులు విప్పేసి, స్వామి ముందుకు వచ్చి గడ్డపారతో హుండీ పెకలించి తీసుకుపోయాడు.

Also Read : Singareni Colleries : సింగరేణి గని ప్రమాదంలో 4కి చేరిన మృతుల సంఖ్య

హండీ  తీసుకువెళ్లిన తర్వాత చెప్పులు వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డి గూడెం ఆర్.ఆర్.సెంటర్ లో నెల కొల్పిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.