Inhumanity In Uttar Pradesh : డబ్బులు ఇవ్వలేదని నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా..నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన అంబులెన్స్‌ డ్రైవర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్‌ డ్రైవర్‌ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది.

Inhumanity In Uttar Pradesh

Inhumanity In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్‌ డ్రైవర్‌ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది. పండరి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అక్కడికి వచ్చిన అంబులెన్స్‌లో ఆమెను ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ డబ్బులు డిమాండ్‌ చేశాడు.

తనకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డ్రైవర్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో తమ దగ్గర డబ్బులు లేవని.. గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారు డ్రైవర్‌కు చెప్పారు. అయితే డబ్బులు లేవనడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ అటవీ ప్రాంతంలోని రోడ్డుపై గర్భిణితో పాటు ఆమె కుటుంబసభ్యులను బలవంతంగా కిందకి దించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను రాజేశ్‌ సాహు అనే జర్నలిస్ట్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అంబులెన్స్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Govt Hospital : అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్‌

అంబులెన్స్‌ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. అసలే పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూడకుండా అమానుషంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.