The Priest Fell From The Top Of The Hill And Died In Ananthapuram Distritct Singanamala
Tragedy In Anantapur District : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఈరోజు శనివారం కావటంతో భక్తులు కొండపైకి భారీగా చేరుకున్నారు. పూజ చేస్తూ హరతి ఇచ్చే క్రమంలో గంట కొడుతూ, హరతి చూపిస్తూ పూజారి కొండపై నుంచి జారి కింద ఉన్న లోయలోకి పడి మరణించాడు.
దాదాపు 100 అడుగుల లోతులో పడిపోవటంతో రాతి దెబ్బలు తగిలి పూజారి మరణించాడు. కొండపైన స్వామికి హారతి చూపించి, కింద ఉన్న గుహలోని దేవుడి వద్దకు వెళ్ళి హారతి చూపించేందుకు దిగుతూ ఉండగా ఈదుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరో వైపు కొండపైన స్వామివారికి భక్తులు సమర్పించిన నూనె ఉండటంతో దానివల్ల కాలు జారి పూజారి మృతి చెందినట్లు కొందరు చెపుతున్నారు. కిందపడిన పూజారికి కొందరు మంచినీళ్లు ఇచ్చి రక్షించే ప్రయత్నం చేసినప్పటీకీ ఆయన మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమచారం తెలుసుకున్న స్ధానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఘటనాస్ధలానికి బయలు దేరారు.