ATM Cash : పట్టపగలే ఏటీఎం వ్యాన్‌లో రూ.66 లక్షలు దోచుకెళ్లి.. మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టి..!

ఎట్టకేలకు ఏటీఎం నగదు దోచుకెళ్లిన నిందితులను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టేసుకున్నారు.

ATM Cash : ఏటీఎంలో నగదు నింపే వ్యాన్‌లో పట్టపగలే లక్షల రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. ఏకంగా రూ.66 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లి ఎక్కడ దాచాలో తెలియక చివరికి మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు. ఒంగోలు పట్టణంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఈ ఘటన జరిగింది. ఎట్టకేలకు ఏటీఎం నగదు దోచుకెళ్లిన నిందితులను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించి వారి నుంచి లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read Also : Cm Jagan : నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి?- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

అసలు దొంగలు వీరే :
దొంగిలించిన డబ్బు మొత్తం మర్రి తొర్రలో పడి ఉండటం చూసి పోలీసులు కంగుతిన్నారు. నిందితులు సీఎంఎస్‌ మాజీ ఉద్యోగి సన్నమూరు మహేష్‌బాబు (22), ఒంగోలు సిఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రాచర్ల రాజశేఖర్‌ (19), గుజ్జుల వెంకట కొండారెడ్డి (40)గా గుర్తించారు. వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది తమ శాఖ నుంచి రూ.68 లక్షలు తీసుకున్నారని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ వెల్లడించారు.

కర్నూలు రోడ్డులోని వర్మ హోటల్ దగ్గర వాహనం ఆపి భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రూ.66 లక్షల చోరీ జరిగినట్లు గుర్తించారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి.. పోలీసులు మహేష్ బాబును పేర్నమిట్ట వద్ద పట్టుకున్నారు. అతన్ని పోలీసులు తమదైన శైలిలో విచారించగా డబ్బును మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టినట్టు చెప్పాడు. లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్‌ కార్యాలయం వద్ద రాజశేఖర్‌, కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Read Also : Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే

ట్రెండింగ్ వార్తలు