ఫోన్ చేసి తిడుతున్నారు..బెదిరిస్తున్నారు : మోహన్ బాబు కంప్లయింట్

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 01:44 PM IST
ఫోన్ చేసి తిడుతున్నారు..బెదిరిస్తున్నారు : మోహన్ బాబు కంప్లయింట్

Updated On : April 3, 2019 / 1:44 PM IST

ఇతర దేశాల నుంచి.. ఇంటర్నెట్ నుంచి బెరింపు కాల్స్ వస్తున్నాయని కంప్లయింట్ చేశారు. కలెక్షన్ కింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోహన్ బాబు. 2019, ఏప్రిల్ 3వ తేదీ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మార్చి 26వ తేదీన ఆయన జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారం రోజుల్లోనే మూడుసార్లు ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో స్టూడెంట్స్ కు అన్యాయం జరుగుతుందని ఉద్యమం చేపట్టారు. అప్పటి నుంచి టీడీపీ అభిమానులు ఫోన్ చేసి తిడుతున్నారని.. బెదిరిస్తున్నారని ఈ కంప్లయింట్ లో స్పష్టం చేశారాయన. ఇతర దేశాల నుంచి వస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు మోహన్ బాబు.
బెదిరింపు కాల్స్ పై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చాలా చూశానని.. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ చర్చకు రావాలని కోరారు. ఎవరైతే తిడుతున్నారో వారికి వాస్తవాలు తెలియవు అని.. విదేశాల్లో కూర్చుని మాట్లాడితే ఏపీలోని పరిస్థితులు ఎలా తెలుస్తాయని చురకలు అంటించారాయన. ఇలాంటి తిట్లు, బెదిరింపులే దీవెనలుగా ముందుకు సాగుతాను అంటున్నారు మోహన్ బాబు.