Ganja At Guntur : గుంటూరులో గంజాయి కలకలం-ముగ్గురు విద్యార్ధులు అరెస్ట్

గుంటూరు నగరo పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సుప్రజ తెలిపారు.

Guntur Ganja

Ganja At Guntur :  గుంటూరు నగరo పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సుప్రజ తెలిపారు.  ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని..  డ్రగ్స్ అమ్మకంలో  ప్రధాన నిందితుడుగా రేవంత్ అనే వ్యక్తిని గుర్తించామని ఆమె తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులని సుప్రజ చెప్పారు.

Also Read : Shilpa Chowdary Custody : శిల్పాచౌదరిని కస్టడీ కోరుతూ మళ్లీ పిటీషన్ వేసిన పోలీసులు

నిందితుల వద్ద నుండి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్.. 8,200 రూపాయల నగదు…3 స్టిప్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో ఇద్దరు తెలంగాణ వారు కాగా ఒకరు  గుంటూరు కు చెందిన విద్యార్ధి అని….రేవంత్ కోసం గాలింపు చేపట్టినట్లు డిఎస్‌పి తెలిపారు.