అంబులెన్స్ ను ఢీకొట్టిన కారు : ముగ్గురు మృతి  

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 02:04 AM IST
అంబులెన్స్ ను ఢీకొట్టిన కారు : ముగ్గురు మృతి  

రంగారెడ్డి : ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు నెత్తురోడింది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిరాల ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారు జామున కారు అదుపు తప్పి అంబులెన్స్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

వైద్య కోసం వ్యక్తిని అంబులెన్స్ లో ఏలూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అంబులెన్స్ లో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో రంగారెడ్డి జిల్లా రావిలాల ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 13 పై శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అదుపు తప్పి అంబులెన్స్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లోని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.