Gun shooting self in birthday party : పుట్టినరోజునే మూడేళ్ల బాలుడుని మృత్యువు కబళించింది. పుట్టినరోజు వేడుకలో తుపాకీతో ఆడుతూ తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి ఛాతిలోకి బుల్లెట్ దిగడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే బాలుడిని ఆస్పత్రి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన అమెరికాలోని టెక్సస్‌లో జరిగింది. ఈశాన్య హౌస్టన్ కు 25 మైళ్లు (40 కిలోమీటర్లు) దూరంలోని పోర్టర్ ప్రాంతంలో బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజ వేడుకులు జరుపుకుంటున్నారు.
పెద్దలంతా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే లోపలికి వెళ్లేసరికి బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
ఛాతిలోకి బుల్లెట్ దిగడంతో అతడ్ని ఫైర్ స్టేషన్ కు తరలించారని Montgomery County Sheriff డిపార్ట్ మెంట్ పేర్కొంది. బర్త్‌డే వేడుకలకు హాజరైన బంధువు జేబులో నుంచి తుపాకీ పడిపోయింది.
ఆ తుపాకీ బాలుడికి దొరికిందని అధికారులు విచారణలో వెల్లడించారు. దాంతో ఆడుకుంటూ తన ఛాతిపై కాల్చుకోవడంతో మృతిచెందాడని అధికారులు పేర్కొన్నారు.
ప్రతి టౌన్‌లో గన్ సేఫ్టీ చట్టం కింద అమెరికాలో మూడొంతుల మందిలో సొంత తుపాకీ కలిగి ఉన్నారు.. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ చట్టం కింద సొంతంగా ఆయుధాలను కలిగి ఉండే హక్కు ఉంది. టెక్సాస్ సహా దాదాపు రాష్ట్రాల్లో తుపాకీ చట్టాల ప్రకారం సొంత తుపాకీలు కలిగి ఉండేందుకు అనుమతి ఉంది.
దాంతో దేశంలో చిన్నారుల చేతుల్లోకి తుపాకులు పేలిన ఘటనలు 229 వరకు పెరిగాయని, అందులో 97 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.