Delhi : రాంగ్‌ రూట్‌లో వచ్చి.. ఆపినందుకు ట్రాఫిక్ ఎస్సైని చితక బాదారు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు.... ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. 

Delhi Traffic Si

Delhi :  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు…. ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.  దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం  ఒక ట్రాఫిక్ ఎసై  ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆసమయంలో   రాంగ్ రూట్ లో, ట్రిపుల్ రైడింగ్ వస్తున్న ఒక బైక్ ను ఆపాడు.  దానిమీద ఒక యువకుడు ఇద్దరు యువతులు ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ కు ముందు నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీంతో ట్రాఫిక్ ఎస్సై  వారిని ఆపాడు.

ఈక్రమంలో వారిలో ఒక యువతి ఎస్సైతో వాగ్వాదానికి దిగింది. ఈ లోపు ఆ ప్రాంతంలో జనం గుమ్మి కూడారు. ఉన్నట్టుండి ఆ యువతి ఎస్సైపై దాడికి దిగింది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు… స్ధానికులు కూడా ఎస్సైపై చేయి చేసుకున్నారు. ఎస్సైపై దాడిని ఆపటానికి ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రయత్నించినప్పటికీ  వీలు కాలేదు. గాయపడిన ఎస్సైను ఆస్పత్రికి తరలించారు .  ఎస్సై పై దాడికి  సంబంధించి టిగ్రి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కాగా ఎస్సై తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి ఆరోపిస్తోంది.