Youtuber Swept Away: ఓ మై గాడ్.. వీడియో తీస్తుండగా ఊహించని ఘోరం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన యూట్యూబర్..

బెర్హం పూర్ కి చెందిన సాగర్ ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు. జలపాతం దగ్గర చిత్రీకరణ చేసేందుకు వెళ్లాడు.

Youtuber Swept Away: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ యూట్యూబర్ జలపాతంలో కొట్టుకుపోయాడు. వీడియో తీసే ప్రయత్నంలో ఈ ఘోరం జరిగింది. నీటి ప్రవాహంలో యూట్యూబర్ కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాగర్ తుడు అనే యూట్యూబర్ సాగర్ కుందు పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. పలు వీడియోలు తీసి అందులో అప్ లోడ్ చేసేవాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ తో కలిసి జలపాతం దగ్గర డ్రోన్ కెమెరాను ఉపయోగించి షాట్లు రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

వీడియో కోసం నీళ్ల మధ్యలో ఓ బండరాయిపై నిల్చున్న అతడు ప్రవాహం ఎక్కువ కావడంతో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు, పర్యాటకులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీడియోల కోసం సాగర్ చేసిన రిస్క్ అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియోల కోసం ఇటువంటి రిస్క్ లు ఎవరూ చేయొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

బెర్హం పూర్ కి చెందిన సాగర్ ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు. జలపాతం దగ్గర చిత్రీకరణ చేసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదకర స్టంట్ చేశాడు. రాళ్లపై నిల్చుని షూట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రవాహం ఎక్కువ కావడంతో అతడు కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది తాళ్లను ఉపయోగించి అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ ప్రవాహం చాలా బలంగా ఉండటంతో ఏమీ చేయలేకపోయారు.

మచకుండ ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినప్పుడు.. సురక్షితమైన తీరాలకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఒక రాతిపై సాగర్ నిలబడి ఉన్నట్లు వీడియోలో ఉంది. అనూహ్యంగా నీటి ప్రవాహం ముంచెత్తడంతో సాగర్ చిక్కుకుపోయాడు. రాయిపై తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

 

 

Also Read: నోయిడా వరకట్నం హత్య కేసులో కీలక పరిణామం.. నిక్కీ భర్తపై కాల్పులు జరిపిన పోలీసులు..