×
Ad

Praveen Nettar Murder : బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

  • Published On : July 28, 2022 / 04:09 PM IST

Praveen Nettar

Praveen Nettar Murder :  కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.  జకీర్, షఫీక్ అనే ఇద్దరు వ్యక్తులు పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియాతో  అనే సంస్ధతో కలిసి పనిచేస్తున్నట్లు అనుమానించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి, ఆసంస్ధతో ఉన్న ఇతర సంబంధాలపై కూడా  విచారిస్తున్నామని కర్ణాటక లాఅండ్ ఆర్డర్ ఏడీజీపీ అలోక్ కుమార్ తెలిపారు.

విచారణలో లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా వారిని  ఈరోజు అరెస్టే చేసినట్లు తెలిపారు. వీరిని పూర్తి స్ధాయిలో విచారిస్తే మరికొన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ నెట్టారు(32) బెల్లారె లోని తన పౌల్ట్రీ ఫామ్ నుంచి సుల్లియా కు ఇంటికి తిరిగి వెళుతుండగా మోటారు సైకిల్ పై వచ్చిన ముగ్గురు దుండగులు అతడిని కొడవలితో నరికి హత్య చేసారు.

మంగుళూరు నగర పోలీసు కమీషనర్, ఉడిపి పోలీసుల సహకారంతో ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏడీజీపీ తెలిపారు. పార్టీ సొంత కార్యకర్తలనే కాపాడుకోలేకపోయిందని ప్రతిపక్షాలు వ్యాఖ్యనించటంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పలు చోట్ల బుధవారం రాళ్ళు రువ్వటం.. పోలీసులు లాఠీ ఛార్జి చేయటం వంటి ఘటనలు నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది.

Also Read : Tiruvannamalai : తిరువణ్ణామలై వద్ద సుబ్రహ్మణ్య హోమం నిర్వహించిన జపనీయులు