Two Childrend Died
Vikarabad : వికారాబాద్ జిల్లా మోమిన్ పేటమండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. తల్లి పరిస్ధితి విషమంగా ఉంది. మోమిన్ పేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు మండలం ఉదండాపూర్‌కు చెందిన భార్యా భర్తలు సుభాష్. మంజులలు టేకులపల్లి గ్రామంలో కోళ్లఫారం వద్ద పని చేసేవారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు… మైత్రి(2) మహేశ్వరి(15 నెలలు) ఉన్నారు.
Also Read :Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు
ఈరోజు ఉదయం పిల్లలు ఇద్దరు మృతి చెంది ఉండగా.. మంజుల పరిస్ధితి విషమంగా ఉండటం స్దానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ధలానికి వచ్చిన పోలీసులు మంజులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే భార్యాభర్తలు భోజనంలో మత్తు మందు కలిపి ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఘటనా స్ధలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.