ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది.
పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్టు కిందకు చేరారు. వీరు చెట్టు కింద ఉండగ పిడుగు పడడంతొ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు షాక్ కు గురై బయట పడ్డారు. షాక్ కు గురైన మహిళలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతిచెందిన వారు కనక దేవికా(30) కబీర్ దాస్ బెలా గ్రామనికి చెందినది కాగ, నగొసే ప్రమిలా(29)బ్రాహ్మనంద్ జునొని గ్రామ మహిళగా గుర్తించారు.