Digital Arrest: వామ్మో.. పహల్గాం ఉగ్రదాడి ఘటననూ వదలని సైబర్ క్రిమినల్స్.. వృద్ధుడి నుంచి ఎన్ని లక్షలు కొట్టేశారంటే..
ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది మోసం అని, మీరు మోసపోయారని కుటుంబ సభ్యులు చెప్పేవరకు ఆయనకు మ్యాటర్ అర్థం కాలేదు.

Digital Arrest: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిండా ముంచుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టి లక్షలు కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో లక్షలు, కోట్లు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. ఏకంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను కూడా వాడేసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఓ ఫోన్ వచ్చింది. తమను తాము యాంటి టెర్రర్ స్వాడ్ పేరుతో వారు పరిచయం చేసుకున్నారు. పహల్గాం ఉగ్రవాదులతో మీకు సంబంధాలు ఉన్నాయని సైబర్ నేరస్తులు ఆయనను బెదిరించారు. పహల్గాం ఉగ్రవాదులకు ఫండ్స్ రైజ్ చేశారని, మనీలాండరింగ్ జరిగిందని బాధితుడిని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు.
వారి మాటలు నమ్మేసిన వృద్ధుడు భయబ్రాంతులకు గురయ్యాడు. డిజిటల్ అరెస్ట్ అనగానే కంగారుపడిపోయాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు నిందితులు చెప్పిన విధంగా 26 లక్షలు చెల్లించాడు. తన ఫిక్స్డ్ డిపాజిట్ తో పాటు భార్య పేరు మీద 20 లక్షలు ఉండగా.. ఆ డబ్బుని కూడా సైబర్ క్రిమినల్స్ కు చెల్లించాడు బాధితుడు.
ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది మోసం అని, మీరు మోసపోయారని కుటుంబ సభ్యులు చెప్పేవరకు ఆయనకు మ్యాటర్ అర్థం కాలేదు. ఆ వెంటనే బాధితుడు 1930 కు కాల్ చేశాడు. జరిగిన మోసం గురించి వివరించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, డిజిటల్ అరెస్ట్ అనే చర్య ఉండదని సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చి చెప్పారు. ఎవరైనా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అని మభ్యపెడితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.