Drugs Seized : విశాఖలో డ్రగ్స్ కలకలం… ఇద్దరి అరెస్ట్

విశాఖపట్నంలో   మరోసారి  డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా  దాడి జరిపి  వీటిని స్వాధీనం చేసుకున్నారు.

Visakhapatnam Drugs seized

Drugs Seized :  విశాఖపట్నంలో   మరోసారి  డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా  దాడి జరిపి  వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక యువతిని, మరోక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Extra Marital Affair : వేరే మహిళ కూడా మనతో కలిసుంటుంది…. భర్త ప్రపోజల్.. భార్య ఏం చెప్పిందంటే…
వీరిలో యువతిది హైదరాబాద్ కాగా…యువకుడిది విశాఖపట్నం మర్రిపాలెంలోని గ్రీన్ గార్డెన్ నివాసిగా గుర్తించారు.  వీరి వద్దనుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్,2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు.  వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసుల మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు.. ఎసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ తెలిపారు.

కాగా  పట్టుబడ్డ ఇద్దరూ ప్రేమికులని తెలిసింది. విశాఖలో డ్రగ్స్‌‌కి అలవాటు పడ్డ ప్రియుడి కోసం…  ఆ యువతి హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చినట్లు తెలిసింది. ఆమె డ్రగ్స్ సరఫరా చేస్తోందనే  పక్కా సమాచారం తోనే పోలీసులు  ఈ ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్నారు.