Extra Marital Affair : వేరే మహిళ కూడా మనతో కలిసుంటుంది…. భర్త ప్రపోజల్.. భార్య ఏం చెప్పిందంటే…

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్న భర్తను సుపారీ  ఇచ్చి హత్య చేయించిన భార్య ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.

Extra Marital Affair : వేరే మహిళ కూడా మనతో కలిసుంటుంది…. భర్త ప్రపోజల్.. భార్య ఏం చెప్పిందంటే…

Extra marital affair murder

Extra Marital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్న భర్తను సుపారీ  ఇచ్చి హత్య చేయించిన భార్య ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని  చిత్తూరు జిల్లా తిరుచానూరుకు   చెందిన కంచికట్ల శ్రీనివాస్(42) అనాధ.  ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా  స్ధిర పడ్డాడు.   ఆ సమయంలో అతనికి ఉప్పల్ లోని ఒక బట్టల షాపులో పనిచేసే  స్వప్న అనే మహిళతో పరిచయం ఏర్పడింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట్ కు చెందిన సప్నకు   అప్పటికే పెళ్లయి,  భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు రాజ్ కుమార్‌ను  పెట్టుకుని జీవనం సాగిస్తోంది.

స్వప్న, శ్రీనివాస్‌లు   ఒకరి నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.  వీరికి కొడుకు(తరుణ్), ఒక కుమార్తె జన్మించారు.  పిల్లలు పుట్టిన కొన్నాళ్లకు స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాడు. అందులో బాగా కలిసి వచ్చింది.  ఉప్పల్,  వేంపేట్ లలో    ఇళ్లు నిర్మించి అమ్మటం మొదలెట్టాడు.  ఈ క్రమంలో  శ్రీనివాస్  మరొక  మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.  ఇటీవలి కాలంలో  ఆమె కూడా మనతో కలిసి జీవిస్తుందని.. ఆమెను ఇంటికి తీసుకు వస్తానని భార్య స్వప్నకు చెప్పాడు.

అందుకు ఆమె అంగకరించలేదు. ఈ విషయమై రోజు భార్యను వేధించసాగాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. భర్త పోరు భరించలేని భార్య,  భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది.  ఇటీవల కుటుంబ సభ్యులందరూ కలిసి వేంపేట వచ్చారు.  అదే అదనుగా భావించిన స్వప్న   తన కుమారులు ఇద్దరూ… నిర్మల్ జిల్లా  ఖానా పూర్ కు చెందిన తన అక్క కొడుకు పొశెట్టిలకు తన మనసులో మాటను  చెప్పింది.  భర్త అరాచకాలను వీరికి వివరించింది.  ఈ ప్లాన్‌ను తమ చేతికి మట్టి అంట కుండా సుపారీ గ్యాంగ్ చేయిద్దామని అక్క  కొడుకు పోశెట్టి చెప్పాడు.

అందుకు అందరూ ఒప్పకున్నారు. పోశెట్టి ఈ ప్లాన్ అమలు చేయటానికి తన తమ్ముడు చిక్కా, అలియాస్ ప్రవీణ్ కుమార్ ని   వేంపేట పిలిపించాడు.  వీరంతా కలిసి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహవీర్,  మ్యాతరి మధు, కొలనురి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్ తో రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

జననరి 22 వతేదీన ప్లాన్ అమలుకు సిధ్దమయ్యారు. ఆరోజు రాత్రి 11 గంటల సమయంలో సుపారీ గ్యాంగ్ నిద్రపోతున్న శ్రీనివాస్ పై రోకలి బండతో తలపై మోది హత్య చేశారు. అతని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయారు.  అనంతరం పోశెట్టి, రాజ్ కుమార్, చిక్కా లు శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకు‌వెళ్లి  నిర్మల్ జిల్లా లక్ష్మణ్  చాంద మండలం కనకాపూర్ సమీపంలోని వాగులో పడేశారు.
Also Read : TS RTC : బొప్పాయి పండు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోకపోవటం అవాస్తవం-ఆర్టీసీ వివరణ
రెండురోజులకు అనుమానాస్పద మతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను  గుర్తించారు. వీరిలో 10 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.  నిందితుల వద్దనుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండనుస్వాధీనం చేసు కున్నారు.  మరో ముగ్గురు పరారీలో ఉన్నారని లక్ష్మణ చాంద డీఎస్పీ తెలిపారు.  మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టామని కేసు దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు.