TS RTC : బొప్పాయి పండు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోకపోవటం అవాస్తవం-ఆర్టీసీ వివరణ

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బొప్పాయి పండు ఫ్రీగా ఇవ్వనందుకు, డ్రైవర్ బస్సు ఎక్కించుకోలేదని ఒక ఫోటో వార్త, రెండు రోజులు క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి  త

TS RTC : బొప్పాయి పండు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోకపోవటం అవాస్తవం-ఆర్టీసీ వివరణ

TS RTC Achampet

TS RTC :  నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బొప్పాయి పండు ఫ్రీగా ఇవ్వనందుకు, డ్రైవర్ బస్సు ఎక్కించుకోలేదని ఒక ఫోటో వార్త, రెండు రోజులు క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి  తెలిసిందే.   ఈ ఘటనను అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ఖండించారు. ఇదంతా  అవాస్తవమని గోపయ్య అనే రైతు కావాలనే సోషల్ మీడియాలో ఇలా దుష్ప్రచారం చేశారని ఆయన వివరణ ఇచ్చారు.

నాగర్ కర్నూలు జిల్లా మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఒకే ఒక్క బస్సు వెళుతుంది. గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన పొలంలో పండించిన బొప్పాయి పళ్లను రోజూ కొల్లాపుర్ తీసుకువెళ్లి అమ్మకం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.

రోజు లాగానే శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో ఎక్కించి…తనకు రావటం కుదరదని కొల్లాపూర్ లో తన వాళ్లు దించుకుంటారని డ్రైవర్ కు చెప్పాడు.   డ్రైవర్ అందుకు అంగీకరించలేదు. మనిషి రాకుండా ఇలా సరుకు తీసుకు వెళ్లమని…. కావాలంటే కార్గోలో బుక్ చేసుకోవాలని చెప్పగా… రైతు దిగిపోయాడు.
Also Read : Budget 2022 : పార్లమెంట్ సమావేశాలకు వేళాయే.. ఈసారి రెండు విడతలు
బస్సు ఊళ్లోకి వెళ్లి, తిరిగి కొల్లాపూర్ వెళుతుండగా రోడ్డు కడ్డంగా బొప్పాయి పళ్ళ బుట్టలు పెట్టి తాను రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.  ఈ దృశ్యాలను ఫోటోలు తీసి… డ్రైవర్ పై నిందలు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశాడని అచ్చంపేట ఆర్టీసీ  డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు.