Budget 2022 : పార్లమెంట్ సమావేశాలకు వేళాయే.. ఈసారి రెండు విడతలు

మొదటి విడత సమావేశాల్లో లోక్ సభ ఛాంబర్ (282), లోక్ సభ గ్యాలరిలు(148), రాజ్య సభ ఛాంబర్(60), రాజ్య సభ గ్యాలరిల్లో(51) సామాజిక దూరం పాటిస్తూ ఎంపీలు కూర్చొనున్నారు. పార్లమెంట్ లో...

Budget 2022 : పార్లమెంట్ సమావేశాలకు వేళాయే.. ఈసారి రెండు విడతలు

Budjet 2021 22

Sessions of Parliament : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2022, జనవరి 31వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పధకాలు సహా దేశపురోగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ప్రసంగం కొనసాగనుంది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం లోక్ సభలో 2021-22 ఆర్ధిక సర్వేను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆమె ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, కేంద్ర బడ్జెట్ పై చర్చ
జరుగనుంది. ఫిబ్రవరి 2 నుంచి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ, ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి.

Read More : Digital ID : ప్రతి భారతీయుడికి ఒకటే డిజిటల్ ఐడీ..! ఆధార్, పాన్ స్థానంలో కొత్త కార్డు…?

మొదటి విడత సమావేశాల్లో లోక్ సభ ఛాంబర్ (282), లోక్ సభ గ్యాలరిలు(148), రాజ్య సభ ఛాంబర్(60), రాజ్య సభ గ్యాలరిల్లో(51) సామాజిక దూరం పాటిస్తూ ఎంపీలు కూర్చొనున్నారు. పార్లమెంట్ లో ఎంపిలకు కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 29 సిట్టింగులతో రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.మొదటి విడతలో సోమవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు 10 పనిదినాల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. రెండవ విడతలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మొత్తం 19 పనిదినాల పాటు సమావేశాలు జరుగనున్నాయి. మొదటి విడతలో ప్రతిరోజు 5 గంటల పాటు ఉభయసభల కార్యకలాపాలు సాగనున్నాయి. మొదటి రెండు రోజులు తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం, మరుసటి రోజు ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రసంగం జరుగనుంది. మిగతా 27 రోజులపాటు సాగనున్న సభా కార్యకలాపాలు కొనసాగించనున్నారు. రెండు విడతలుగా జరిగే సమావేశాలకు ఉభయసభల సభా కార్యక్రమాలు నిర్వహణకు చెరో 135 గంటల సమయం కేటాయించారు.

Read More : Facebook Messenger: చాటింగ్ సేఫ్టీ కోసం మెసేజింగ్ యాప్ కొత్త ఫీచర్

తొలివిడత బడ్జెట్ సమావేశాల్లో లభించే మొత్తం సమయం 40 గంటలు కాగా రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో లభించే మొత్తం సమయం 95 గంటలు. తొలివిడతలో ప్రతిరోజు సమావేశాల్లో జీరో అవర్ ను అరగంటకు రాజ్యసభ కుదించింది. రెండు విడతల్లో జరిగే మొత్తం 27 సిట్టింగులకు గాను “జీరో అవర్” కోసం మొత్తం 13.30 గంటలు సమయం కేటాయించారు. ప్రశ్నోత్తరాల సమయం ఎప్పటిలాగానే 27 సిట్టింగులుకు గానూ, ప్రతిరోజు గంట చొప్పున మొత్తం 27 గంటలు కేటాయించారు. ప్రయివేట్ మెంబర్స్ బిజినెస్ కోసం 15 గంటలు కేటాయుంపు. స్పల్ప కాలిక చర్చ, ప్రజా ప్రయోజనార్ధం అత్యవసర చర్చ కోసం వచ్చే నోటీసులతో పాటు, బిల్లుల పై చర్చ, ఆమోదం కోసం ప్రభుత్వానికి మిగిలిన సమయం 79.30 గంటలుంగా ఉంది. మరి పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగుతాయా ? ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదాలు పడుతాయా ? అనేది చూడాలి.