Digital ID : ప్రతి భారతీయుడికి ఒకటే డిజిటల్ ఐడీ..! ఆధార్, పాన్ స్థానంలో కొత్త కార్డు…?

త్వరలో దేశ ప్రజలందరికి ఒకటే డిజిటల్ ఐడీ ఉండనుందా? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు స్థానంలో కొత్త కార్డు రానుందా? ఇక నుంచి ప్రత్యేక ఐడీలను అందించాల్సిన అవసరం లేదా?

Digital ID : ప్రతి భారతీయుడికి ఒకటే డిజిటల్ ఐడీ..! ఆధార్, పాన్ స్థానంలో కొత్త కార్డు…?

Digital Id Card

Digital ID : త్వరలో దేశ ప్రజలందరికి ఒకటే డిజిటల్ ఐడీ ఉండనుందా? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు స్థానంలో కొత్త కార్డు రానుందా? ఇక నుంచి ప్రత్యేక ఐడీలను అందించాల్సిన అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి అవుననే సమాధానం వస్తోంది. సెంట్రలైజ్డ్ డిజిటల్ ఐడెంటీస్ కోసం కొత్త విధానాన్ని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ శాఖ కొత్త టెక్నాలజీపై పనిచేస్తోందని సమాచారం.

Crab Blood : ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే.. ఎందుకో తెలుసా?

ఆధార్ కార్డును పోలిన మరో కార్డును తయారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ అనే కొత్త మోడల్ ను కేంద్రం తయారు చేస్తోందట. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ తేనుందని సమాచారం. భవిష్యత్తులో ఈ ఒక్క కార్డుతో.. పౌరులు అన్ని సేవలు పొందేలా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందట.

ఆధార్, పాన్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటీ కార్డులను నియంత్రణలో ఉంచేందుకు ప్రతి ఒక్క పౌరునికి డిజిటల్ సాధికారత కల్పించేందుకు ఈ డిజిటల్ ఐడీ పని చేయనుంది. త్వరలోనే ఈ డిజిటల్ ఐడీ ప్రతిపాదన ప్రజల్లోకి రానుంది. ఫిబ్రవరి 27 వరకు దీనిపై ప్రజల నుంచి కామెంట్లను స్వీకరించనున్నారు. కొత్త డిజిటల్ ఐడీ కార్డుతో.. పాన్, ఆధార్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు.. ఇలా అన్ని ఐడీలను ఇంటర్ లింక్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు.

Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్

ఈ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఐడెంటీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అన్ని ఐడెంటీ కార్డులను అనుసంధానం చేయనున్నారు. ఈ-కేవైసీ ద్వారా ఇతర థర్డ్ పార్టీ సర్వీసులను పొందేందుకు కూడా ఈ డిజిటల్ ఐడీని వాడనున్నారు. డ్రాఫ్ట్ ప్రతిపాదన ప్రకారం పదే పదే వెరిఫికేషన్ చేపట్టే ప్రక్రియలను ఈ డిజిటలైజేషన్ తొలగించనుంది. 2017లోనే ఈ డిజిటల్ ఐడీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం.