Crab Blood : షాకింగ్.. ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే.. ఎందుకో తెలుసా?

పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షల పైనే... ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా?.. కానీ, ఇది నిజమే. మార్కెట్ లో పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షలకు పైగా పలుకుతుంది. దీనికి కారణం..

Crab Blood : షాకింగ్.. ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే.. ఎందుకో తెలుసా?

Horseshoe Crab Blood

Crab Blood : పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షల పైనే… ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా?.. కానీ, ఇది నిజమే. మార్కెట్ లో పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షలకు పైగా పలుకుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సురక్షితమా కాదా అనేది హార్స్ షూ పీతల రక్తంతో పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుందట. అందుకే వీటి రక్తానికి మార్కెట్ లో అంత రేటు. మరో స్పెషాలిటీ ఏంటంటే.. వీటి బ్లడ్ నీలి రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూగోల్డ్ అంటారు.

‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అంతేకాదు.. పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులే. ఈ కారణంగానే వీటి రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షల పైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్‌ఏఎల్‌) కోసం వెచ్చిస్తుంటాయి.

Reliance Jio 5G speed: ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్ చేయవచ్చు

సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి, ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. అనంతరం ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులు గుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికిపైగా లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ సేకరణ, తరలింపు, రక్తం తగ్గిపోవడం క్రమంలో దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి.

సాధారణంగా ఏదైనా దెబ్బతగలడం, వ్యాధి వల్ల, శస్త్రచికిత్స ద్వారా అయిన గాయాలు మానకుండా.. పుండ్లుగా మారి, చీముపట్టడాన్ని సెప్టిక్‌ అంటాం. సదరు గాయంలోని ఇన్ఫెక్షన్‌ రక్తంలోకి వ్యాపించి.. శరీర అవయవాలను దెబ్బతీసే స్థితిని ‘సెప్సిస్‌’గా చెప్తారు. మొదట్లోనే దీన్ని గుర్తించలేక.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది చనిపోతున్నట్టు అంచనా. హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్‌ఏఎల్‌’ ద్వారా ‘సెప్సిస్‌’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రకంగానూ హార్స్‌షూ పీతలు మానవాళికి మేలు చేస్తున్నాయి. ఒక్క వ్యాక్సిన్ల తయారీలోనే కాదు యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ పీత రక్తం(ఎల్‌ఏఎల్‌)తో పరీక్షిస్తారు. శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్ష చేస్తారు. అందుకే వీటి బ్లడ్ కు అంత డిమాండ్.

మనుషుల రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్) ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. వాటి రక్త కణాల్లో ఉండే రాగి (కాపర్‌) అణువులే దీనికి కారణం. ఇది ఈ పీతల మరో ప్రత్యేకత.

కోతి(గొరిల్లా/చింపాంజి) నుంచి మనిషి అభివృద్ధి చెందినట్టుగా.. కాలం గడిచిన కొద్దీ ప్రతి జీవి పరిణామం చెందుతుంది. కానీ ‘హార్స్‌షూ’ పీతలు పెద్దగా పరిణామం చెందకుండా.. సుమారు 45 కోట్ల ఏళ్ల కిందట (డైనోసార్ల కంటే ముందటి కాలం నుంచి) ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని బతికున్న శిలాజాలుగా పిలుస్తున్నారు.

Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో వాటికి మరింత కష్టమొచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటి టెస్టింగ్‌ కోసం భారీగా పీతలను పడుతూ, రక్తాన్ని సేకరిస్తున్నారు.