Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

మద్యం తాగటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఆల్కహాల్‌లో ఎలాంటి కేలరీలు లేవని బావిస్తుంటారు. దీనిని బ్యాలెన్స్ చేసేందుకు అల్కాహాల్ కి తోడుగా ఆహారం తీసుకుంటారు.

Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

Wine

Drink Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పినా ఆ మాటలు చెవికెక్కించుకునే వారే కరువయ్యారు. చాలా మంది మద్యానికి బానిసలైపోయి ప్రతిరోజు మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. మరికొందరు మాత్రం విందు, వినోదాలు, స్నేహితులతో కలసి సరదాగా మద్యం సేవిస్తుంటారు. అప్పుడప్పుడు మద్యం సేవించటం వల్ల పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ అదే పనిగా నిత్యం మోతాదుకు మించి మద్యం సేవిస్తే మాత్రం ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

మద్యం మితంగా తాగితే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అదే అలవాటుగా చేసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో ఊబకాయనికి దారితీసే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. మద్యం అలవాటు శరీరంలో కొలెస్ట్రరాల్ స్థాయిలను పెంచడం, అధిక రక్తపోటును కలిగిస్తాయి. దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుంది. ప్రతిరోజూ మద్యం తాగేవారు అకారణంగా బరువు పెరిగిపోతారు. బరువు పెరగటం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మద్యం తాగటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఆల్కహాల్‌లో ఎలాంటి కేలరీలు లేవని బావిస్తుంటారు. దీనిని బ్యాలెన్స్ చేసేందుకు అల్కాహాల్ కి తోడుగా  ఆహారం తీసుకుంటారు. వాస్తవానికి ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీరులో కేలరీలు అధికంగానే ఉంటాయి. హార్డ్ డ్రింక్స్‌లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు పెరగడానికి తోడ్పడుతుంది.

కొంతమందిలో మద్యం సేవించాక తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో అవి తినడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునేవారు రోజు కాకుండా అప్పుడప్పుడు 500 మిల్లీ లీటర్లకు మించకుండా మద్యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంట్రోల్ తప్పి మద్యం తీసుకుంటే మాత్రం బరువు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

అప్పుడప్పుడు మద్యం తాగటం వల్ల బరువు పెరిగే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. మితంగా తీసుకోవటం అలావాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా అతిగా మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.