Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్

ఆహారం అధికంగా తీసుకోవడం, జంక్‌ పుడ్‌ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక జత్తిడి ఉండటం, స్త్రీలలో హార్మోన్‌ సమతుల్యత దెబ్బతినడం,

Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్

Over Weight

Updated On : January 30, 2022 / 3:59 PM IST

Over Weight : గుండె జబ్బులు, డయాబెటిస్‌, కీళ్లనొప్పులు, అధికరక్తపోటు…ఇలా అనేక రకాల వ్యాధులు రావడానికి మూలకారణం స్ధూలకాయం. కానీ చాలా మంది స్ధూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, నమస్య వచ్చిన తరువాత బరువులు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గాలనే తాపత్రయంతో ఆహారం మానేసి కొత్త నమన్యలు కొని తెచ్చుకుంటారు. నిజానికి ఆయుర్వేద వైద్యంతో ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా స్థూల కాయాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఈ మధ్యకాలంలో స్టూలకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది. చిన్న పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోంది. ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఆయుర్వేదంలో స్ధౌల్యం అంటారు. స్థూలకాయం ఒక వ్యాధి కాకున్నా అనేక వ్యాధులకు కారణమవుతుంది.

కారణాలు ;

ఆహారం అధికంగా తీసుకోవడం, జంక్‌ పుడ్‌ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక జత్తిడి ఉండటం, స్త్రీలలో హార్మోన్‌ సమతుల్యత దెబ్బతినడం, హైపోథైరాయిడిజం, కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యంగా స్టూలకాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. స్తూలకాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరగడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువే. స్థూలకాయం వల్ల ఆర్థరైటిస్‌, శ్వాస సంబంధ సమస్యలు రావచ్చు. ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నాడని నిర్జారించడానికి బాడీమాస్‌ఇండెక్స ఉపయోగపడుతుంది.

స్థూలకాయం సమస్యను ఆయుర్వేదంలో మేదోరోగంగా పరిగణించడం జరిగింది. దీనికి శోదన, శమన అని రెండు రకాల చికిత్సలు అద్భుతంగా ఉపయోగపడతాయి. శోదన చికత్సలో కషాయవస్తి ప్రధాన చికిత్స అని చెప్పవచ్చు. దీనితో పాటు ఉద్వర్తనం, స్వేదనం లాంటి చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయి. శమన చికిత్సలో నాలుగవ ధాతువైన మేధోదాతువును కరిగించుటకు కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు సూచించడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా అవసరమైన మేరకు శారీరక వ్యాయామం చేయడం, జీర్గశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం వల్ల స్టూలకాయం రాకుండా కాపాడుకోవచ్చు.