Two Killed And Buried Friend
Two Killed And Buried Friend : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. ఐదు రోజుల క్రితం ఒక చిన్నబాబు చనిపోయాడని.. అతన్ని పూడ్చిపెట్టాడానికి గొయ్యి తీయాలని సమీర్ అహ్మద్‌కు.. అతని చిన్నానాటి స్నేహితులు మహ్మద్ ఇలియాస్, రుస్తుం చెప్పారు. దీంతో వారిని నమ్మిన సమీర్ గొయ్యిని తవ్వాడు.
గొయ్యిని తవ్విన తర్వాత రాడ్డుతో కొట్టారు. సమీర్ గొయ్యిలో పడిన తర్వాత మళ్లీ రాళ్లతో దారుణంగా కొట్టి కిరాతంగా హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ముస్లిం సంపద్రాయం ప్రకారం సమాధిపై పూలు చల్లారు. అయితే సమీర్ అదృశ్యమవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Extra Marital Affair Murder : ఫ్రెండ్ ప్రియురాలిపై మోజు….అక్రమ సంబంధంతో స్నేహితుడి హత్య…!
నిందితులను ఘటన స్థలానికి తీసుకొచ్చిన పోలీసులు క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సభ్యుల సమక్షంలో గొయ్యిని తవ్వించారు. అనంతరం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అయితే సమీర్ తండ్రి దగ్గర తాము తీసుకున్న 50 వేల రూపాయిల కోసం వేధించినందుకే హత్య చేశామని నిందితులు వెల్లడించారు.