UP Woman Fire Gun Shots : పుట్టినరోజు సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లో  ఒక మహిళ తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పూట కేక్ కట్ చేసి... తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈవీడియో సోషల్ మీడియాలో  వైరల్  కావటంతో పోలీసులు ఆ మహిళపై కేసు

Up Woman Gun Shots

UP Woman Fire Gun Shots :  ఉత్తరప్రదేశ్‌లో  ఒక మహిళ తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పూట కేక్ కట్ చేసి… తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈవీడియో సోషల్ మీడియాలో  వైరల్  కావటంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి   వెళితే  ముజఫర్‌నగర్  జిల్లాలో కొత్వాలి ప్రాంతానికి చెందిన మహిళ బుధవారం అర్ధరాత్రి తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంది.  ఇందులో భాగంగా ఇరుకైన వీధిలో నీలం లైట్ల కాంతిలో  కేక్ కట్ చేసి అనంతరం తుపాకీని పైకి ఎత్తి గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపింది. అంతకు ముందు ఆమె కేక్ కట్ చేస్తుండగా… ఆమె సోదరుడు అదే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
Also Read :
వీరితో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఈ వీడియోలో ఉన్నారు.  ఈ రెండు వీడియోలను ఒక నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ముజఫర్ నగర్ పోలీసుల ట్విట్టర్ ఖాతాకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని రీ ట్వీట్ చేశారు.