ఉగ్రవాదుల పనేనా : నెదర్లాండ్స్ లో కాల్పుల కలకలం..ఒకరు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 12:36 PM IST
ఉగ్రవాదుల పనేనా : నెదర్లాండ్స్ లో కాల్పుల కలకలం..ఒకరు మృతి

న్యూజిలాండ్ కాల్పుల ఘటన మరువక ముందే సోమవారం(మార్చి-18,2019) నెదర్లాండ్స్ లో మరో దారుణం జరిగింది.సెంట్రల్ డచ్ లోని అట్రెక్ట్ సిటీలోని 24అక్టోబర్ స్క్వేయర్ దగ్గర ట్రామ్ లో వెళుతున్న ప్రయాణికులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. అంతేకాకుండా సిటీలోని మరికొన్ని ప్రదేశాల్లో కూడా దుండగులు కాల్పులకు తెగబడినట్లు డచ్ కౌంటర్ టెర్రరిజమ్ ఏజెన్సీ తెలిపింది.
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

ఈ కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సిటీ మొత్తం హైల అలర్ట్ ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయా ఏరియాల్లోని మసీదులు, రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్న ప్రజలను అక్కడినుంచి తరలించారు.బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు డచ్ పోలీసులు నగర పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.కాల్పుల ఘటన పట్ల నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Also : అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం