ఇతడో సైకో.. వరసగా ఆరుగురిని చంపాడు.. ఎట్టకేలకు అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

Crime: లచ్చన్న పాలేనికి చెందిన వాలంటీర్ ను హత్య చేసింది కూడా ఇదే నిందితుడని..

ఇతడో సైకో.. వరసగా ఆరుగురిని చంపాడు.. ఎట్టకేలకు అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

ఆరు హత్యలు చేసిన ఓ సైకో కిల్లర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని మాకవరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపేంద్ర బాబు వరస హత్యలు చేశాడని మాకవరపాలెం పోలీసులు తెలిపారు.

నర్సీపట్నం రూరల్ సీఐ హరి మీడియాతో మాట్లాడుతూ… గంగవరంలో చోటు చేసుకున్న హత్యలో కూపి లాగిన పోలీసులకు ఆశ్చర్యం కలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఇదే మండలంలో లచ్చన్న పాలేనికి చెందిన వాలంటీర్ ను హత్య చేసింది కూడా ఇదే నిందితుడని తెలిపారు.

అనుమానస్పదంగా మాడుగుల ప్రాంతానికి చెందిన ఉపేంద్రబాబును విచారించగా ఆరు హత్యలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. మాడుగుల ప్రాంతంలో రెండు హత్యలు చేసి బెయిల్ పై వచ్చిన ఉపేంద్ర.. మునగపాకలోనూ మరో రెండు హత్యలు చేశాడని తెలిపారు. అతడిని రిమాండ్ కి తరలించామని అన్నారు.

Video: కుమారి ఆంటీలా స్ట్రీట్ ఫుడ్‌ నడుపుతున్న 10 ఏళ్ల బాలుడు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్ర