Shocking News : కొడుకుతో విడాకులు… మామతో పెళ్లి……!
ఉత్తరప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కొడుకు విడాకులిచ్చిన యువతిని, తండ్రి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు భార్యగా ఉన్న యువతి ఆ యువకుడికి ఇప్పుడు సవతి తల్లి అయ్యింది.

Up Man Married Daughter In Law
Divorced Woman Married Her Uncle : సమాజంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువ కుటుంబాల్లో తండ్రికి, కొడుక్కి పడదు. ఇద్దరి మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. వారిద్దరూ తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ప్రతి చోటా చూస్తూనే ఉంటాం.
కానీ ఉత్తరప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కొడుకు విడాకులిచ్చిన యువతిని, తండ్రి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు భార్యగా ఉన్న యువతి ఆ యువకుడికి ఇప్పుడు సవతి తల్లి అయ్యింది. అంటే విడాకులు తీసుకున్న కోడలి మెడలో మామ మూడు ముళ్లు వేసి భార్యగా చేసుకున్నాడు. ఈ వార్త చదవగానే మీరు షాక్ కు గురయ్యారు కదా…. మీకే ఇలా ఉంటే ఆమె భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి… ఈ సంగతి తెలిసి షాక్ కు గురైన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో 2016 సంవత్సరంలో మైనర్లుగా ఉన్నఓ జంట పెళ్లి చేసుకున్నారు. ఆ యువకుడు ఎప్పడూ తండ్రితో గొడవలు పడేవాడు. పైగా తాగుబోతు. ఈక్రమంలో భార్యతోనూ గొడవపడేవాడు. గొడవలతో ఆ కొత్త జంట ఆరు నెలల్లోనే విడిపోయారు. తన భర్త తాగుబోతని, అతని నుంచి విడాకులు కావాలని కోరింది. ఆయువకుడు ఆమెను వదులుకోటానికి ఇష్ట పడలేదు. అయినా ఆమె అతడి నుంచి విముక్తి కావాలని కోరుకుని…విడాకులు తీసుకుని వెళ్లిపోయింది.
కొన్నాళ్లకు ఆ యువకుడి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తండ్రి కనిపించకుండా వెళ్లిపోయిన కొన్నాళ్లకు తన తండ్రి ఆచూకి కనిపెట్టాల్సిందిగా స్ధానిక పంచాయితీ ఆఫీసులో యువకుడు సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ దాఖలు చేశాడు. దీంతో అధికారులు అతడి తండ్రి ఆచూకి తెలుసుకుని యువకుడికి సమాచారం చెప్పారు. ఆ సమాచారం తెలుసుకున్న యువకుడు షాక్‌కు గురయ్యాడు.
తనతో విడాకులు తీసుకున్న యువతి, 48 ఏళ్ల తన తండ్రి పెళ్లి చేసుకుని సంభాల్ ప్రాంతంలో కాపురం ఉంటున్నారని తెలిసి నిర్ఘాతం పోయాడు. అనంతరం తండ్రి, భార్యపై బిసౌలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముగ్గురిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడా తండ్రి కొడుకులిద్దరూ గొడవ పడ్డారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. అయితే సవతి తల్లిగా మారిన మాజీ భార్య మాత్రం తాను రెండో భర్తతోనే సుఖంగా, సంతోషంగా ఉన్నానని…మొదటి భర్త దగ్గరకు వెళ్లనని పోలీసులకు తేల్చి చెప్పింది.