KPHB Police : విజయ భాస్కర్ రెడ్డి హత్య, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు
హాస్టల్ సీసీ కెమెరాల ఆధార్యంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... విజయ భాస్కర్‌ను కారులో తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే విషయాలు వెలుగు చూశాయి. విజయ్ భాస్కర్ రెడ్డికి ఆహారంలో మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పాక.. రాడ్‌తో కొట్టి చంపేసి.. బాడీని తరలించారని గుర్తించారు.

Kphb
Vijaya Bhaskar Reddy Murder : ఒక్క హత్య, వంద అనుమానాలు.. ఇదీ రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి కేసులో పరిస్థితి. కేసు విచారించిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కేపీహెచ్‍బీలో కిడ్నాప్ చేసిన నిందితులు… శ్రీశైలం సమీపంలోని సుందిపెంటకు తీసుకు వెళ్లి దహనం చేశారు. కేపీహెచ్‌బీ నుంచి శ్రీశ్రైలం మధ్యలో ఏం జరిగింది. అసలు ఈ హత్య ఎందుకు చేశారు. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక సూత్రదారి అని భావిస్తున్న ఓ బాబా కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం :-
నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం విజయ్‌భాస్కర్‌రెడ్డి.. హైదరాబాద్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. నాలుగు నెలల నుంచి కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. ఉన్నట్టుండి గత నెల 20న ఆయన అదృశ్యమయ్యారు. అతని ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండడంతో గత నెల 24వ తేదీన అతని అల్లుడు సృజన్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ సీసీ కెమెరాల ఆధార్యంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు… విజయ భాస్కర్‌ను కారులో తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే విషయాలు వెలుగు చూశాయి. విజయ్ భాస్కర్ రెడ్డికి ఆహారంలో మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పాక.. రాడ్‌తో కొట్టి చంపేసి.. బాడీని తరలించారని గుర్తించారు.
అసలు ఎందుకు చంపారు ? :-
అసలు విజయభాస్కరెడ్డిని చంపాల్సిన అవసరం ఏంటి.. నలుగురు నిందితులకు, మృతుడికి లింక్ ఏంటి.. అనే కోణంలో విచారణ జరిపారు పోలీసులు. కేవలం తనను అప్రతిష్టపాలు చేస్తున్నాడనే కారణంతోనే రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డిని నెల్లూరుకు చెందిన బాబా త్రిలోక్‌నాథ్ హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన త్రిలోక్‌నాథ్.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నిజాంపేట్‌లో మకాం వేసేవాడు. అక్కడి వారికి వాస్తుపరమైన సలహాలిచ్చేవాడు.
గురూజీపై ఒత్తిడి :-
ఇదే సమయంలో.. అక్కడే కేపీహెచ్‌బీలో ఉంటున్న విజయ్‌భాస్కర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. విదేశాల నుంచి నిధులు వస్తాయని బాబా త్రిలోక్‌నాథ్ మాటలు నమ్మి అతను భారీగా నగదు ఇచ్చాడు. అయితే.. నిధులు రాకపోవడంతో.. గురూజీపై విజయ్‌భాస్కర్ ఒత్తిడి పెంచాడు. గురూజీ అక్రమాల భాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో.. తనను అప్రతిష్టపాలు చేస్తున్నాడంటూ విజయ్‌భాస్కర్‌పై కక్ష పెంచుకున్న గురూజీ.. తన అనుచరులతో ప్లాన్ చేసి సినీ స్టైల్లో చంపేశాడు. విజయ్ భాస్కర్‌రెడ్డిని అంతమొందించేందుకు నిందితులు పక్కా ప్లాన్ వేశారు.
గురూజీ ప్లాన్ :-
గురూజీ త్రిలోక్‌నాథ్ ఈ ప్లాన్ రూపొందించగా.. మల్లేశ్, రియల్టర్ సుధాకర్, కృష్ణంరాజు, ఓ డాక్టర్ అమలు చేశారు. విజయభాస్కర్ ఉండే హాస్టల్లోనే మల్లేశ్ తన కుమారుడిని దించాడు. విజయ భాస్కర్‌తో మంచిగా మెలుగుతూ జులై 20న మంచూరియాలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తిని స్పృహ తప్పి పడిపోయిన విజయభాస్కర్‌రెడ్డిని చంపి శ్రీశైలం వైపు తీసుకెళ్లారు. తమ బంధువు చనిపోయాడంటూ మృతదేహాన్ని దహనం చేయాలని శ్రీశైలం సమీపంలో సుందిపెంటలో ఓ కాటి కాపరిని నమ్మించారు. కానీ కాటి కాపరి చితిపై ఉంచిన విజయభాస్కర్ మృతదేహాన్ని సెల్‌లో ఫోటో తీశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. కేసు గుట్టు విడిపోయింది.