Phone Snatch Incident : వణుకు పుట్టించే వీడియో.. ఇంటి బయట కూర్చుని ఫోన్ చూస్తున్నారా? ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి..

ఆమె తేరుకుని అరిచేలోపు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Phone Snatch Incident : దొంగలు, చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అని తేడా లేదు.. కన్నుపడితే ఖతమే. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే కాదు.. పట్టపగలు అంతా తిరుగుతున్న సమయంలోనూ కన్నింగ్ గాళ్లు బరితెగిస్తున్నారు. రెప్పపాటులో దోచుకుని పరార్ అవుతున్నారు. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన ఒకటి జరిగింది.

తన ఇంటి బయట టూ వీలర్ పై కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. బైక్ పై వచ్చిన దుండగులు.. ఆమె చేలోని ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. అసలేం జరిగిందో ఆమెకు కాసేపు అర్థం కాలేదు. షాక్ లో ఉండిపోయింది. ఆమె తేరుకుని అరిచేలోపు స్నాచర్లు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : సనాతన ధర్మాన్ని భ్రష్టుపట్టించారు.. గెటౌట్.. సన్యాసినిగా మమతా కులకర్ణి బహిష్కరణ

రెప్పపాటలో ఫోన్ కొట్టేసిన స్నాచర్లు..
ఓ మహిళ తన ఇంటి బయట ఉన్న టూ వీలర్ పై కూర్చుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఫోన్ చూస్తూ ఆమె అక్కడ కూర్చుంది. ఫోన్ చూడటంలో ఆమె చాలా బిజీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆ వీధిలోకి ఓ బైక్ వచ్చింది. దానిపై ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకడు రెప్పపాటులో ఆమె చేతిలోని ఫోన్ కొట్టేశాడు. అంతే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

 

ఊహించని ఘటనతో ఆమె షాక్ కి గురైంది. నోటి నుంచి మాట రాలేదు. దొంగలను అలా చూస్తూ ఉండిపోయింది. కొన్ని సెకన్ల పాటు ఆమె మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి షాక్ నుంచి తేరుకుని అరిచింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ దొంగలు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

ఇంటి ముందే ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిందే..
రోడ్లపై వెళ్లే సమయంలోనే కాదు.. ఇంటి ముందే ఉన్నా.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. మనం ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా.. ఇదిగో ఇలా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మన ఇంటి బయటే ఉన్నాం కదా.. ఏమీ కాదులే అని అనుకోవడానికి ఎంతమాత్రమూ లేదు.

Also Read : గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించింది- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ

మనం ఏ పని చేస్తున్నా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేందుకు ఈ ఘటనే ఎగ్జాంపుల్. మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు? మనవైపు ఎవరు వస్తున్నారు? అసలేం జరుగుతోంది? అనేది నిత్యం కనిపెట్టుకుని ఉండాల్సిందే. లేదంటే, ఇదిగో ఇలాంటి ఘోరాలు జరగడం ఖాయం అంటున్నారు పోలీసులు.