Sonia Gandhi Remarks : గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించింది- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ ఆధిపత్య అహంకారానికి ఈ మాటలు నిదర్శనం అని.. ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమానత్వ విలువలకు ఇది అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sonia Gandhi Remarks : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. పూర్ లేడీ అంటూ రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సోనియా గాంధీ వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తిప్పికొట్టింది.
రాష్ట్రపతి ఎప్పుడూ అలసిపోలేదు..
రాష్ట్రపతి భవన్ తన ప్రకటనలో సోనియా గాంధీ వాదనలను ఖండించింది. రాష్ట్రపతి ఎప్పుడూ అలసిపోలేదంది. అట్టడుగు వర్గాలు, మహిళలు, రైతులు దీర్ఘకాలంగా పోరాడుతున్న సమస్యల కోసం మాట్లాడటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని పేర్కొంది. అటువంటి వ్యాఖ్యలు భారతీయ భాషలలో, ముఖ్యంగా హిందీలో ఉపయోగించే భాషా పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఉత్పన్నమవుతాయని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది.
”సత్యానికి దూరంగా ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. నిజానికి, అట్టడుగు వర్గాలకు, మహిళలు, రైతుల కోసం, ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఎప్పటికీ అలసిపోదని ఆమె నమ్ముతుంది” అని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సోనియా వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ కూడా నిరాశ వ్యక్తం చేసింది. వాటిని పేలవమైనవిగా, పూర్తిగా నివారించదగినదిగా పేర్కొంది.
సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం..
”ఈ నాయకులు హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసంతో తమకు తాముగా పరిచయం లేకపోవడమే కాకుండా తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం అభిప్రాయపడింది. ఏది ఏమైనప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు పేలవమైనవి, దురదృష్టకరం, పూర్తిగా నివారించదగినవి” అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read : మధ్య తరగతికి గుడ్ న్యూస్? బడ్జెట్‌కి ముందు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
10 కోట్ల మంది గిరిజనులను, దేశంలోని ప్రతి పేదవాడిని కించపరచడమే- ప్రధాని మోదీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి పూర్ థింగ్ అంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ప్రధాని మోదీ. గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించిందని ధ్వజమెత్తారు. ఆ ఫ్యామిలీలో ఒకరు.. రాష్ట్రపతిది బోరింగ్ స్పీచ్ అన్నారు. మరొకరు రాష్ట్రపతి పూర్ థింగ్ అన్నారు. ఇది 10 కోట్ల మంది గిరిజనులను, దేశంలోని ప్రతి పేదవాడిని కించపరచడమే అని ప్రధాని మోదీ మండిపడ్డారు.
ముర్ము మాతృభాష హిందీ కాకపోయినా లోక్ సభలో ఆమె అద్భుతంగా ప్రసంగించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబాన్ని షాహీ పరివార్ (రాచరిక కుటుంబం) అని ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ.
ఇది షాహీ పరివార్ అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది- ప్రధాని మోదీ
ఇది “షాహీ పరివార్(రాయల్ ఫ్యామిలీ)” అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. 10 కోట్ల గిరిజన జనాభాను అవమానించడమే. రాష్ట్రపతి మాతృభాష ఒడియా అయినప్పటికీ హిందీలో పార్లమెంటులో స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఒడిశా అడవుల్లోని గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము నేడు అలాంటి స్థితికి చేరుకున్నారు. ఆమె మాతృభాష హిందీ కాదు. ఒడియా. అందులోనే ఆమె పెరిగింది. పేదలు, దళితులు, గిరిజనులు, ఓబీసీల నుంచి అభివృద్ధి చెందుతున్న వారందరినీ అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటు” అని విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ.
సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతిని సోనియా గాంధీ అవమానించారని మండిపడ్డారు. సోనియా గాంధీ వెంటనే రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి..
సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆదివాసీలకు సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని ఉద్దేశించి పూర్ థింగ్, బేచారీ అంటూ సంబోధించడాన్ని జేపీ నడ్డా తప్పుపట్టారు.
ఇలాంటి పదాలను వాడటం కాంగ్రెస్ పార్టీ.. ఆదివాసీ, పేదల వ్యతిరేక, ఉన్నతవర్గ అహంకార ధోరణికి నిదర్శమన్నారు జేపీ నడ్డా. రాష్ట్రపతి ముర్ము బలమైన మహిళ అని, దేశానికి ఆమె ఎంతో సేవ చేశారని జేపీ నడ్డా అన్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం దారుణం అన్నారు. వెంటనే రాష్ట్రపతికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్ లేడీ, చదివి చదివి చివరికి అలసిపోయారు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పై స్పందించిన సోనియా గాంధీ.. పూర్ లేడీ, చదివి చదివి చివరికి అలసిపోయారు. అంత చదవాల్సింది కాదు అని సోనియా అన్నారు. దాంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది.
కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మైండ్ సెట్ కు అద్దం పడతాయి..
సోనియా గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మైండ్ సెట్ కు అద్దం పడతాయని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా విమర్శించారు. రాజ్యాంగ విలువలకు కాంగ్రెస్ పార్టీ పాతర వేసిందన్నారు. రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానించడం ఇది తొలిసారి కాదన్నారు. మాట ఎత్తితే రాజ్యాంగం ప్రతిని పార్లమెంటుకు తీసుకొచ్చే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అంబేద్కర్ రాజ్యాంగం, రాజ్యాంగం విలువలు కాంగ్రెస్ కు పట్టవన్నారు. దళితులు, బీసీలు, ఆదివాసీయులు అంటే కాంగ్రెస్ కు చిన్నచూపు అని అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ.. ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటే అని మండిపడ్డారు. దేశ విజన్ ను వివరించిన రాష్ట్రపతిని అవమానించడం దారుణం అన్నారు.
మొత్తం ఆదివాసీలందరికీ అవమానం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని సోనియా గాంధీ ఓల్డ్ పూర్ లేడీ అని సంబోధించడాన్ని రాష్ట్రపతి కార్యాలయం తప్పుపట్టింది. బ్రిటీష్ కాలం నాటి మైండ్ సెట్ నుంచి కాంగ్రెస్ ఇంకా బయటకు రాలేదని చెప్పడానికి నిదర్శనం అంది. దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా చేసిన వ్యాఖ్యలు.. మొత్తం ఆదివాసీలందరికీ అవమానం అంది. కాంగ్రెస్ ఆధిపత్య అహంకారానికి ఈ మాటలు నిదర్శనం అంది. ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమానత్వ విలువలకు ఇది అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.