Budget 2025: మధ్య తరగతికి గుడ్ న్యూస్? బడ్జెట్‌కి ముందు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుందని ద్రౌపది ముర్ము అన్నారు.

Budget 2025: మధ్య తరగతికి గుడ్ న్యూస్? బడ్జెట్‌కి ముందు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Droupadi Murmu

Updated On : January 31, 2025 / 11:45 AM IST

కేంద్ర సర్కారు మూడురెట్ల వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ లక్ష్యం భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. ఇండియా ఏఐ మిషన్ ప్రారంభమైందని చెప్పారు.

ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుందని ద్రౌపది ముర్ము అన్నారు. మహిళల నేతృత్వంలోని దేశంలో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

ప్రభుత్వం యువత విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారికి కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించిందని ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చామని తెలిపారు.

దేశంలోని మహిళలు వేగంగా సాధికారత సాధించేలా చర్యలు తీసుకుంటామని ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వం కొత్త పథకాలను వేగంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు.

సైబర్ భద్రతలో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము అన్నారు. డిజిటల్ ఫ్రాడ్‌, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్ వంటివి సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు తీవ్రమైన సవాళ్లని ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ త్వరలోనే అవతరించనుందని ముర్ము తెలిపారు.

Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్.. అప్పటిలా షేర్ మార్కెట్‌పై అదే అనవాయితీ.. వారాంతంలో ట్రేడింగ్..!