Visakha MRO Case
Visakha MRO Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు సీపీ. కేసు రీ ఇన్వెస్టిగేషన్ చేసి హత్యకు ప్రధాన కారణాలు, వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.
చినగదిలి రూరల్ తహసీల్దార్ రణమయ్య దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొమ్మది చరణ్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్ గేటు ముందే తహసీల్దార్ పై రాడ్ తో దాడి చేశారు. దీంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మరణించారు.
Also Read : పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు..! కట్ చేస్తే దిమ్మతిరిగిపోయే మోసం.. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ ఫ్రాడ్
ఎమ్మార్వో రమణయ్య సొంతూరు శ్రీకాకుళం జిల్లా మండలం దిమ్మిలాడ గ్రామం. విధుల్లో చేరి పదేళ్లు అవుతోంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్ లో ఏవోగా రమణయ్య పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండురోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. మొదటిరోజు విధులకు హాజరై రాత్రి 8గంటల సమయంలో రమణయ్య ఇంటికి చేరుకున్నారు. రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ప్లాట్ నుంచి కిందకు వెళ్లిన తహసీల్దార్ రమణయ్య ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్ గా సంభాషణ చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
Also Read : లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం.. 5కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం